కుమార్తెను చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడు.. ఆర్మీ జవాన్ ఏమి చేశాడంటే

Army jawan fires at school director as teacher slaps his daughter in Rajasthan. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఉపాధ్యాయుడు తమ కుమార్తెను చెప్పుతో కొట్టినందుకు పాఠశాల డైరెక్టర్‌పై కాల్పులు జరిపాడు ఓ ఆర్మీ జవాన్.

By M.S.R  Published on  4 Jan 2022 3:00 PM GMT
కుమార్తెను చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడు.. ఆర్మీ జవాన్ ఏమి చేశాడంటే

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఉపాధ్యాయుడు తమ కుమార్తెను చెప్పుతో కొట్టినందుకు పాఠశాల డైరెక్టర్‌పై కాల్పులు జరిపాడు ఓ ఆర్మీ జవాన్. ఈ కాల్పుల కారణంగా పాఠశాల డైరెక్టర్ భార్యను గాయపరిచాడని పోలీసులు సోమవారం తెలిపారు. హోంవర్క్ పూర్తి చేయనందుకు టీచర్ తనను చెప్పుతో కొట్టాడని అతని కుమార్తె ఫిర్యాదు చేయడంతో సైనికుడు పప్పు గుర్జార్ సోమవారం కన్వాడ గ్రామంలోని ఒక ప్రైవేట్ పాఠశాల డైరెక్టర్‌ను కలవడానికి వెళ్లాడు.

ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత గుర్జార్ స్కూల్ డైరెక్టర్‌పై తుపాకీ గురిపెట్టాడు. ఆ సమయంలో డైరెక్టర్ భార్య మధ్యలోకి రావడంతో ఆమె చేతికి బుల్లెట్ తగిలిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కామ దౌలత్ సింగ్ తెలిపారు. ఘటన తర్వాత జవాన్ అక్కడి నుంచి పారిపోయాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. గుర్జర్ సెలవులో ఉన్నారని, పాఠశాల డైరెక్టర్‌ను కలవడానికి వెళ్లినప్పుడు అతను తన సర్వీస్ రివాల్వర్ ను తన వెంట తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు.

Next Story
Share it