నార్సింగీ లో సోమవారం హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. నార్సింగీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించారు. ఔటర్ రింగు రోడ్డుపై రోడ్డు క్రాస్ చేస్తున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు స్పాట్ లో మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించారు. గచ్చిబౌలి నుండి ఎయిర్ పోర్ట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
హిట్ అండ్ రన్ కేసులో చనిపోయిన వ్యక్తిని ఆర్మీ సోల్జర్ కులాన్గా పోలీసులు గుర్తించారు. కులాన్ గోల్కొండ ఆర్టలరీ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్నాడు. అసలు కులాన్ ఔటర్ రింగ్ రోడ్ వైపు ఎందుకు వచ్చాడనే విషయమై పోలీసులు విచారిస్తున్నారు. సీసీ టీవీ పుటేజ్ లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.