స్పెషల్ ఆపరేషన్.. 5000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి

ఆదివారం గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో ప్రత్యేక జాయింట్ ఆపరేషన్‌లో రూ.5,000 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు

By M.S.R  Published on  14 Oct 2024 1:10 PM IST
స్పెషల్ ఆపరేషన్.. 5000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి

ఆదివారం గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో ప్రత్యేక జాయింట్ ఆపరేషన్‌లో రూ.5,000 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు, గుజరాత్ పోలీసుల సంయుక్త బృందం అంక్లేశ్వర్‌లోని ఆవ్కార్ డ్రగ్స్ లిమిటెడ్ కంపెనీ ప్రాంగణంలో దాడి చేసింది. ఈ సమయంలో 518 కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ మార్కెట్ విలువ రూ.5,000 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. వరుస ఘటనల్లో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది.

ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఇటీవల రెండు ఆపరేషన్లలో ఢిల్లీలో 700 కిలోలకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. అక్టోబర్ 1న దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో 500 కిలోల కొకైన్ దొరికింది. రమేష్ నగర్ ప్రాంతంలో జరిపిన దాడిలో మరో 200 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ డ్రగ్స్ ఫార్మా సొల్యూషన్ సర్వీసెస్ అనే కంపెనీకి చెందినవని, గుజరాత్‌లోని అవ్కార్ డ్రగ్స్ లిమిటెడ్ నుంచి వచ్చినవని తేలింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 1,289 కిలోల కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ థాయ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని మొత్తం విలువ రూ. 13,000 కోట్లని అంచనా వేస్తున్నారు.

Next Story