హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం..కోలివింగ్‌ హాస్టల్స్‌లో దందా

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపాయి.

By -  Knakam Karthik
Published on : 4 Nov 2025 11:02 AM IST

Crime News, Hyderabad, drug bust, HYD Police

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం..కోలివింగ్‌ హాస్టల్స్‌లో దందా

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపాయి. విశ్వసనీయ సమాచారం మేరకు మాధాపూర్‌ ఎస్‌.ఓ.టి. పోలీసులు గచ్చిబౌలి పరిధిలోని టీఎన్జిఓ కాలనీ లో ఓ ఎస్ఎం లగ్జరి గెస్ట్ రూమ్ మరియు కో లివింగ్ లో దాడులు నిర్వహించారు. డ్రగ్స్ తీసుకుంటున్న వ్యక్తులతో పాటు డ్రగ్స్ విక్రేతలను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మొత్తం 18 మంది ఉండగా అందులో 12 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఎం‌డి‌ఎం‌ఏ డ్రగ్‌ 31.2 గ్రాములు, గాంజాయి 3 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుల్లో ఒకరు నైజీరియాకు చెందిన ప్రధాన డ్రగ్ సరఫరాదారుగా గుర్తించారు. అయితే ఆ నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిందితులలో ఐటీ ఉద్యోగులు, ఆర్కిటెక్టులు, డ్రైవర్లు, డిజే ప్లేయర్లు, ఫోటోగ్రాఫర్లు వంటి వివిధ వృత్తుల వ్యక్తులు ఉన్నాట్లు సమాచారం. వారి వద్ద నుండి 6 లక్షల 51వేల విలువ చేసే డ్రగ్స్ తో పాటు మొబైల్ ఫోన్లు, రెండు ద్వి చక్ర వాహనాలు, డాంగిల్స్, జీపిఎస్ కార్డు రీడర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story