పిజ్జా డెలివ‌రీ లేట్ అయ్యింద‌ని కాల్పులు..!

మహారాష్ట్రలోని పూణే నగరంలో 27 ఏళ్ల వ్యక్తి తన ఇంటి వద్దకు పిజ్జా ఆలస్యంగా వచ్చినందుకు

By Medi Samrat  Published on  25 Oct 2023 5:08 PM IST
పిజ్జా డెలివ‌రీ లేట్ అయ్యింద‌ని కాల్పులు..!

మహారాష్ట్రలోని పూణే నగరంలో 27 ఏళ్ల వ్యక్తి పిజ్జా ఆలస్యంగా వచ్చినందుకు డెలివరీ బాయ్‌పై దాడి చేశాడు.. ఆ తర్వాత జరిగిన గొడవలో గాలిలోకి కాల్పులు జరిపాడు. అయితే.. అత‌డిని అరెస్టు చేసిన‌ట్లు బుధవారం ఓ పోలీసు అధికారి వెల్లడించారు. సోమవారం రాత్రి నగరంలోని వాఘోలి ప్రాంతంలోని ప్రముఖ పిజ్జా అవుట్‌లెట్‌లో నిందితుడు చేతన్ పడ్వాల్ ఆర్డర్ ఇచ్చాడు.

లోనికండ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. డెలివరీ మ్యాన్ రుషికేశ్ అన్నపూర్వే.. పిజ్జాతో పడ్వాల్ ఇంటికి చేరుకోగానే ఆర్డర్ ఆలస్యంగా డెలివరీ చేసినందుకు త‌న‌పై దురుసుగా ప్రవర్తించడ‌మేకాక‌.. దాడి కూడా చేశాడని ఆరోపించారు. అన్నపూర్వే సహచరులు ఇద్దరు తమ సిబ్బందిపై ఎందుకు దాడి చేశారో వివరణ ఇవ్వాలని అడిగేందుకు రాగా.. పడ్వాల్ వారిలో ఒకరి కాలర్‌ను పట్టుకుని అతనిపై కూడా దాడి చేశాడు. అదే కోపంతో పడ్వాల్ తన కారు వైపు పరిగెత్తి.. పిస్టల్ తీసి గాలిలోకి కాల్పులు జరిపాడని అధికారి తెలిపారు.

పిజ్జా విక్రేత యొక్క ఉద్యోగుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు పడ్వాల్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని 308, 323, 504 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన‌ట్లు అధికారి తెలిపారు. పడ్వాల్‌కు పిస్టల్ లైసెన్స్ ఉందని పోలీసులు తెలిపారు.

Next Story