ఏపీలో దారుణం.. 15 ఏళ్ల బాలికపై తండ్రి అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న కూతురిని కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన తండ్రే కాటేశాడు.

By అంజి  Published on  12 March 2025 11:43 AM IST
father, Girl, Rajahmundry, Crime, APnews

ఏపీలో దారుణం.. 15 ఏళ్ల బాలికపై తండ్రి అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న కూతురిని కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన తండ్రే కాటేశాడు. కొన్నాళ్ల నుంచి సొంత కూతురిపైనే తండ్రి లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. నిందిత తండ్రిపై రాజమండ్రి త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు అయ్యింది. 8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక మంగళవారం నాడు స్కూల్‌కు వచ్చింది. క్లాస్‌ రూమ్‌లో డల్‌గా ఉన్న బాలికను టీచర్‌ ఓదార్చుతూ ఏమైందని అడిగింది. దీంతో తన తండ్రి రాక్షసకాండను బాలిక బయటపెట్టింది.

తండ్రి తనపై చేస్తున్న దాడిని వివరించింది. తండ్రి మద్యానికి బానిసగా మారి రాత్రి సమయంలో కూతురుపై పలుమార్లు అత్యాచారం చేశాడు. జరిగిన విషయం చెప్పడంతో టీచర్‌ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా విభేదాలతో బాధితురాలి తండ్రి వద్ద నుంచి తల్లి తన ముగ్గురు కూతుళ్లతో ఎనిమిదేళ్ల కిందట పుట్టింటికి వెళ్లింది. మూడేళ్లుగా పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉంటుండగా ఈ అఘాయిత్యం జరిగింది.

Next Story