హైదరాబాద్‌లో దారుణం..8 ఏళ్ల బాలికపై అత్యాచారం

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు

By -  Knakam Karthik
Published on : 10 Oct 2025 9:23 AM IST

Crime News, Hyderabad, Girl Raped, Hyd Police

హైదరాబాద్‌లో దారుణం..8 ఏళ్ల బాలికపై అత్యాచారం

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సైదాబాద్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే దంపతులిద్దరూ కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇద్దరు చిన్నారులను ఓ యువకుడు తన ఇంటికి పిలిచాడు. సోదరుడి ముందే బాలికపై ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు. అయితే బాలిక అనారోగ్యానికి గురికావడం.. తల్లిదండ్రులు బాలిక సోదరుడిని నిలదీడయంతో ఈ దారుణ ఘటన బయటికి వచ్చింది. కాగా ఘటనపై తల్లిదండ్రులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Next Story