హైదరాబాద్‌లో మరో దారుణం.. 11 ఏళ్ల బాలికపై 80 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం

An 80-year-old man sexually assaulted an 11-year-old girl in Hyderabad. హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 80 ఏళ్ల వృద్ధుడు తన కామవాంఛతో 11 ఏళ్ల బాలికపై ఆకృత్యానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  21 Nov 2021 6:20 AM GMT
హైదరాబాద్‌లో మరో దారుణం.. 11 ఏళ్ల బాలికపై 80 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 80 ఏళ్ల వృద్ధుడు తన కామవాంఛతో 11 ఏళ్ల బాలికపై ఆకృత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు.. 80 ఏళ్ల వృద్ధుడితో అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళ మనవరాలు. పోలీసుల తెలిపిన కథనం మేరకు.. పాతబస్తీ ప్రాంతానికి చెందిన బషీర్‌ (80) ఓ పెద్ద వయస్సును మహిళతో అక్రమ సంబంధాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మహిళ మనుమరాలిపై వృద్ధుడు బషీర్‌ కన్నేశాడు. మహిళతో పరిచయాన్ని ఆసరగా చేసుకుని.. ఆమె మనువరాలిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక అమ్మమ్మ బషీర్‌ను నిలదీయగా.. తనకేమీ తెలియదంటూ నిందితుడు బుకాయించాడు. ఆ తర్వాత బాలికను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లింది.

80 ఏళ్ల వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని అమ్మమ్మ డాక్టర్లకు చెప్పింది. దీంతో డాక్టర్ల సలహా మేరకు బాలిక, బాలిక అమ్మమ్మ అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే బాలిక నివసించే ప్రాంతం ఛత్రినాక పీఎస్‌ పరిధిలోకి వస్తుండటంతో ఆ కేసును అక్కడికి బదిలీ చేశారు. ఈ కేసును ఏసీపీ మహ్మద్‌ మాజిద్‌ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బషీర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 11 ఏళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది. చాలా సురక్షితమైన హైదరాబాద్‌ మహా నగరంలో రోజు రోజుకు దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

Next Story
Share it