రూ.200 కోసం తల్లిని నరికి చంపిన కొడుకు

Alcoholic kills mother for refusing Rs 200 in Mancherial. మంచిర్యాలలో శనివారం అర్థరాత్రి దారుణం జ‌రిగింది. ప‌ట్ట‌ణంలోని రాజీవ్‌నగర్‌లో

By Medi Samrat  Published on  20 Feb 2022 1:21 PM IST
రూ.200 కోసం తల్లిని నరికి చంపిన కొడుకు

మంచిర్యాలలో శనివారం అర్థరాత్రి దారుణం జ‌రిగింది. ప‌ట్ట‌ణంలోని రాజీవ్‌నగర్‌లో ఓ వ్యక్తి తన తల్లిని నరికి చంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం కొనేందుకు రూ.200 ఇచ్చేందుకు నిరాకరించినందుకు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి త‌న‌ తల్లిని నరికి చంపాడు. మంచిర్యాల సబ్‌ఇన్‌స్పెక్టర్ గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. వితంతువు, దినసరి కూలీ అయిన తన తల్లి సత్తెమ్మ(65)ని కడమండ చంద్రశేఖర్ డబ్బుల కోసం రోజూ వేధించేవాడు. ఎప్ప‌టిలాగే శనివారం కూడా తల్లిని డ‌బ్బులు అడిగాడు చంద్రశేఖర్. లేవ‌ని చెప్ప‌డంతో ఆవేశానికి లోనైన చంద్రశేఖర్.. తల్లిపై గొడ్డలితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.


Next Story