తమిళనాడులోని ఓ లాయర్ చేసిన పని అందరిని షాక్‌కు గురి చేసింది. మద్రాసు హైకోర్టులో వర్చువల్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఓ న్యాయవాది అసభ్యకర రీతిలో ప్రవర్తించాడు. విచారణ జరుగుతుండగానే ఓ మహిళతో న్యాయవాది రాసలీలు కొనసాగించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఓ కేసుకు సంబంధించిన వాదనలు వర్చువల్‌గా సాగుతున్నాయి. ఈ కేసులో న్యాయవాది ఆర్డీ సంతాన కృష్ణన్ ఇన్వాల్వ్ అయ్యాడు. మరోవైపు లాయర్లు కేసును వాదిస్తున్నారు. అప్పటికే కెమెరా ఆన్ చేసి ఉన్నా.. అది గమనించని న్యాయవాది మహిళతో రాసలీలు కొనసాగించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యాయవాది చేష్టలను గమనించిన న్యాయమూర్తి వెంటనే సీరియస్ అయ్యారు. మద్రాస్ హైకోర్టు ఇప్పుడు న్యాయవాదిపై ధిక్కార చర్యలను ప్రారంభించింది. జస్టిస్ ఇళంతిరాయన్ కోర్టు విచారణలో ఈ ఘటన జరిగింది. వర్చువల్ హియరింగ్ ద్వారా హాజరైన ఒక న్యాయవాది, ఒక మహిళతో రాసలీలు సాగించారు. ఈ వీడియో త్వరలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జస్టిస్ ప్రకాష్, హేమలతల ధర్మాసనం ఈ విషయంలో స్వయంచాలకంగా కోర్టు విచారణను ప్రారంభించింది.
ఐటీ చట్టం ప్రకారం ఇది నేరం కావడంతో దీనిపై సీబీసీఐడీ విచారణకు కూడా కోర్టు ఆదేశించింది. ఫిజికల్ హియరింగ్ కోసం పలువురు న్యాయవాదులు హాజరుకావడంతో, హైబ్రిడ్ మోడ్ ఆఫ్ హియరింగ్‌ను మళ్లీ సందర్శించాల్సిన సమయం ఆసన్నమైందని కోర్టు పేర్కొంది. ఇదిలావుండగా, తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ ఇప్పుడు ఆ న్యాయవాదిని ఏ కోర్టులోనూ ప్రాక్టీస్ చేయకుండా సస్పెండ్ చేసింది.