జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై వ్యక్తిని పొడిచి చంపిన నిందితులు అరెస్ట్
జగద్గిరిగుట్టలో నిన్న నడిరోడ్డు మీద ఓ వ్యక్తి మరో వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
By - Knakam Karthik |
జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై వ్యక్తిని పొడిచి చంపిన నిందితులు అరెస్ట్
హైదరాబాద్: జగద్గిరిగుట్టలో నిన్న నడిరోడ్డు మీద ఓ వ్యక్తి మరో వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు... రంగారెడ్డినగర్‌కి చెందిన రోషన్ సింగ్ (25) ఓ రౌడీ షీటర్... జగద్గిరిగుట్టలోని సోమయ్య నగర్ కు చెందిన బాలశౌరెడ్డి (23) పాత నేరస్థుడు... అయితే రోషన్ సింగ్ 15 రోజుల క్రితం ఓ ట్రాన్స్ జెండర్ ను మాట్లాడుకొని రంగారెడ్డి నగర్ లోని నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు... అయితే డబ్బులు చెల్లించే విషయంలో ట్రాన్స్ జెండర్, రోషన్ సింగ్ మధ్య వాగ్వివాదం చెలరేగింది. దీంతో ఆ ట్రాన్స్ జెండర్ బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ జెండర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రౌడీషీటర్ రోషన్ సింగ్ తో పాటు అతని స్నేహితులపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు.
ఇది ఇలా ఉండగా మరోవైపు తన శత్రువు బాలశౌరెడ్డి ట్రాన్స్ జెండర్‌తో కేసు పెట్టించాడని రోషన్ సింగ్ అనుమానం వ్యక్తం చేశాడు ఎలాగైనా సరే చంపేస్తారని మిత్రులతో చెప్పే వాడు. అయితే ఈ విషయం కాస్త బాలశౌరెడ్డికి తెలిసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం సమయంలో బాలశౌ రెడ్డి అతని స్నేహితులు ఆదిల్ మహమ్మద్ కలిసి పీకలదాకా మద్యం సేవించారు. ఆ మద్యం మధ్యలో ముగ్గురి మధ్య గొడవ జరిగింది దీంతో గొడవ పెట్టుకుంటూ జగద్గిరిగుట్ట చివరి బస్టాండ్ వద్దకు చేరుకున్నారు ఉన్నట్లుండి అక్కడ రౌడీషీటర్ రోషన్ సింగ్ కనిపించడంతో వెంటనే మహమ్మద్ అతన్ని పట్టుకోగా బాలశౌరెడ్డి ఆగ్రహంతో రోషన్ ను కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం బైక్‌పై సిద్ధంగా ఉన్న ఆదిలతో కలిసి బాలశివరెడ్డి అక్కడి నుండి పారిపోయాడు. అయితే నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే బాలశివరెడ్డి రౌడీషీటర్ రోషన్ సింగ్ పొడిచి పారిపోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏ ఒక్కరు కూడా వచ్చి ఆపేందుకు ప్రయత్నం చేయలేదు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే రోషన్ సింగ్ లో చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. హాస్పటల్లో చికిత్స పొందుతున్న రౌడీ షీటర్ రోషన్ సింగ్ మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి నిందితులను అరెస్ట్ చేశారు.