ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. నగరి మండలం రామాపురం వద్ద ప్రమాదం చోటు చేసుకోగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి-చెన్నై రహదారిపై వేగంగా వచ్చిన లారీ, బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురితో పాటు మరొకరు మృతి చెందారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి పట్టణంలోని రుయా హాస్పిటల్‌కు తరలించారు.