నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Accident In Nagarkurnool. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ
By Medi Samrat Published on
23 July 2021 2:25 PM GMT

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్ వద్ద రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఎనిమిది దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థతి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైద్రాబాద్ కు తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి అతివేగం కారణమని తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్ చేసి సంఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. తక్షణమే క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించి వైద్య సేవలందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను సీఎం ఆదేశించారు.
Next Story