విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
Accident In Gandipeta. గండిపేట సీబీఐటి రోడ్డులో అతివేగంగా వచ్చిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు
By Medi Samrat Published on
12 Aug 2021 10:49 AM GMT

గండిపేట సీబీఐటి రోడ్డులో అతివేగంగా వచ్చిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడగా.. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వివరాళ్లోకెళితే.. గండిపేట నుండి నార్సింగ్ వైపు వెళ్తున్న ఓ కారులో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. కారు వేగంగా వస్తున్న క్రమంలో సడెన్‌గా ఆటో అడ్డంగా రావడంతో ఆటోను తప్పించబోయి కరెంటు స్తంభానికి ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ఘటనలో కౌశిక్, జో డౌన్ అనే ఇద్దరు విద్యార్థులు మరణించారు. విద్యార్థులు అందరూ గండిపేట సీబీఐటీ కాలేజీలో ఒక విద్యార్థికి ఎగ్జామ్ ఉన్నందువలన కాలేజ్ దగ్గరికి వచ్చారు. తిరిగి ప్రయాణం చేసే సమయంలో కారు యాక్సిడెంట్ కు గురైందని విద్యార్థులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Next Story