4 రోజుల్లో పెళ్లి.. పెళ్లి పత్రికలను పంచేందుకు వెళ్లి..!

Accident In Anantapur. అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.

By Medi Samrat
Published on : 23 Aug 2021 1:01 PM IST

4 రోజుల్లో పెళ్లి.. పెళ్లి పత్రికలను పంచేందుకు వెళ్లి..!

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. పత్రికలను పంచడానికి వెళ్లిన వరుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయాడు. అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకలవాండ్లపల్లి సమీపంలో చోటుచేసుకుంది. ఈ నెల 27 న కదిరిలో ఎర్రదొడ్డికి చెందిన మహేష్‌ (26) కు వివాహం జరగాల్సి ఉంది. బంధువులకు వివాహ పత్రికలను పంచేందుకు స్వగ్రామం నుంచి అర్ధరాత్రి బయలుదేరిన మహేష్‌ కొద్ది సమయానికే గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు.

ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన మహేష్‌ నెల రోజుల కిందటే పెళ్లి కోసం సొంత ఊరికి వచ్చాడు. త్వరలో ఓ ఇంటివాడై కోడలితో కలిసి జంటగా వస్తాడనుకుంటే అందరిని వదిలేసి వెళ్లాడంటూ కుటుంబీకులు, బంధువులు రోదించారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని.. మృతదేహాన్ని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 27న కదిరిలో మహేశ్‌ వివాహం జరగాల్సి ఉండగా.. ఇంతటి దారుణం జరుగుతుందని స్నేహితులు, కుటుంబ సభ్యులు అసలు ఊహించలేకపోయారు.


Next Story