ట్రాక్టర్‌ను ఢీకొట్టిన‌ మినీ లారీ.. ముగ్గురు మృతి

Accident In Adilabad District. ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివ‌రాళ్లోకెళితే.. జిల్లా కేంద్రంలోని గుడిహత్నూర్‌

By Medi Samrat  Published on  17 July 2021 3:38 AM GMT
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన‌ మినీ లారీ.. ముగ్గురు మృతి

ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివ‌రాళ్లోకెళితే.. జిల్లా కేంద్రంలోని గుడిహత్నూర్‌ మండలంలోని మన్నూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను మినీ లారీ ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన మినీలారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. ట్రాక్టర్‌ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాద స్థ‌లాన్ని ప‌రిశీలించారు.

మినీ లారీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ధర్మారం నుంచి టమాటా లోడుతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగం కాగా.. ట్రాక్టర్ వాహనానికి రాత్రి వేళల్లో ప్రమాదం జరగకుండా ఉండాల్సిన సూచిక (రేడియమ్స్) లేకపోవడంతో.. ఐచర్ వాహనం అతి వేగంగా వచ్చి ఢీ కొట్ట‌డంతో ప్రమాదం సంభవించిందని స్థానికి ఎస్ఐ ప్ర‌వీణ్ కుమార్‌ తెలిపారు. మృతులు రామాంజనేయులు, ఖాజా, ట్రాక్టర్‌పై ప్ర‌యాణిస్తున్న‌ మరో వ్యక్తిని గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story
Share it