ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

Accident At Sangareddy District. సంగారెడ్డి జిల్లాలోని చౌట‌కూర్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. లారీ-కారు ఎదురెదురుగా

By Medi Samrat  Published on  6 Aug 2021 10:22 AM GMT
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలోని చౌట‌కూర్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. లారీ-కారు ఎదురెదురుగా ఢీకొన్న దుర్ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురు వ్య‌క్తులు దుర్మ‌ర‌ణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ బాలుడు ఉన్నారు. వివరాళ్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన పద్మ(30), అంబదాస్‌(40) దంపతుల కుమారుడు వివేక్‌(6) అనారోగ్యానికి గురి కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు.

ఆసుప‌త్రి నుండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. చౌటకూర్‌ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పుల్కల్‌ ఎస్సై నాగలక్ష్మి సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story
Share it