మంగళ్‌హాట్ డివిజన్‌లోని TGSPDCLలో పనిచేస్తున్న ఆర్టిజన్ అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తిని మంగళవారం తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) అరెస్టు చేసింది. మీటర్ కు సంబంధించి ఓ ఫిర్యాదుదారుడి నుండి రూ.20,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించాడు.
ఎటువంటి జరిమానా లేకుండా సమస్యను సాల్వ్ చేస్తానంటూ రెహమాన్ లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయం ఏసీబీ అధికారులకు తెలిసింది. ఫిర్యాదుదారుడి నుండి రెహమాన్ కు డబ్బులు అందగానే అధికారులు ఎంటర్ అయ్యారు. అతని వద్ద నుండి డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు ACB అధికారులు తెలిపారు.
రసాయన పరీక్షలో రెహమాన్ రెండు చేతుల వేళ్లు పాజిటివ్‌గా వచ్చాయి. ACB అధికారులు నాంపల్లిలోని ACB కేసుల ప్రత్యేక కోర్టు ముందు రహమాన్‌ను హాజరుపరిచారు, తరువాత కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.