లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై
ACB Caught Jagtial Sub Inspector. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
By Medi Samrat Published on
17 Jun 2021 12:16 PM GMT

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జగిత్యాల పట్టణ ఎస్ఐ శివ కృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గత నెలలో నమోదైన ఓ కేసుకు సంబంధించి అప్పటి ఎస్ఐ శంకర్ నాయక్ నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వగా.. అదే కేసు విషయమై ప్రస్తుత జగిత్యాల పట్టణ ఎస్ఐ శివ కృష్ణ నిందితుల నుండి రూ.50,000 లంచం డిమాండ్ చేయడంతో.. సదరు నిందితులు రూ.30,000 తీసుకొని ఏసీబీని ఆశ్రయించారు. నిందితుల వద్ద నుండి రూ.30,000 లంచం తీసుకుంటుండగా శివ కృష్ణ ఏసీబీకి పట్టుబడ్డారు.
Next Story