గర్ల్ ఫ్రెండ్‌తో సహా ఆప్ నేత అరెస్ట్

లిప్సీ అలియాస్ మాన్వి మిట్టల్ అనే 33 ఏళ్ల మహిళ హత్యకు సంబంధించి లూథియానా పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, అతని స్నేహితురాలు, నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్‌లను అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  17 Feb 2025 9:04 PM IST
గర్ల్ ఫ్రెండ్‌తో సహా ఆప్ నేత అరెస్ట్

లిప్సీ అలియాస్ మాన్వి మిట్టల్ అనే 33 ఏళ్ల మహిళ హత్యకు సంబంధించి లూథియానా పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, అతని స్నేహితురాలు, నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్‌లను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాన్వి తన భర్త అనోఖ్ మిట్టల్ కు వివాహేతర సంబంధం ఉందని గుర్తించడం వల్లే ఆమె హత్యకు గురైంది. దంపతుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెను దారుణంగా హత్య చేశారు. మాన్వి హత్యకు అనోఖ్, అతని స్నేహితురాలు ప్రతీక్ష కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు.

2.5 లక్షలు చెల్లించి హత్య చేసేందుకు అమృతపాల్ సింగ్, గురుదీప్ సింగ్, సోనూ సింగ్, సాగర్‌దీప్ సింగ్, గురుప్రీత్ సింగ్ గోపీ అనే ఐదుగురు వ్యక్తులను అనోఖ్, ప్రతీక్ష నియమించుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. హత్యలో ప్రమేయం ఉన్న వారందరినీ పోలీసులు అరెస్టు చేయగా, గురుప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు.

లూథియానా-మలేర్‌కోట్ల రహదారిపై రాత్రి భోజనం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా తనపై, తన భార్యపై ఐదుగురు దుండగులు దాడి చేశారని తొలుత అనోఖ్ పోలీసులకు చెప్పాడు. దాడి చేసిన వ్యక్తులు తనను రాడ్‌తో కొట్టి, మత్తుమందు ఇచ్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత తన భార్యపై దాడి చేసి బంగారం, నగదు, మొబైల్ ఫోన్లు, కారుతో పారిపోయారని చెప్పాడు. అయితే అతడు చెప్పిన మాటలకు పోలీసులకు అనుమానం వచ్చింది. విచారణలో అసలు నిజం బయట పడింది. అనోఖ్ మిట్టల్, ప్రతీక్ష సంబంధం లిప్సీకి తెలిసిపోవడంతో ఆమెను చంపడానికి కుట్ర పన్నారని లూథియానా పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ ధృవీకరించారు. అనోఖ్ గతంలో తన భార్యను రెండుసార్లు చంపడానికి ప్రయత్నించి విఫలమయ్యాడని పోలీసులు తెలిపారు.

Next Story