సోదరుడి లైంగిక వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి

A young woman committed suicide due to her brother's sexual harassment. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ల్యాదెళ్ల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి

By అంజి
Published on : 23 Aug 2022 12:03 PM IST

సోదరుడి లైంగిక వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి

హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ల్యాదెళ్ల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో 19 ఏళ్ల యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. సోమవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇంటర్‌ వరకు చదువుకున్న యువతి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన సంగాల సాయి, యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 3 నెలల కిందట వీరిద్దరూ శారీరకంగా కలిసారు. అదే సమయంలో సాయి.. ఆమె ఫొటోలు తీసుకున్నాడు. అయితే ఆ ఫొటోలను తొలగించాలని సాయిని యువతి వేడుకుంది. దీంతో సాయి.. ఫొటోలు తొలగిస్తానని నమ్మబలికి, ఆ ఫొటోలను తన ఫ్రెండ్‌ ప్రణయ్‌కు పంపించాడు.

యువతికి ప్రణయ్‌ వరుసకు సోదరుడు అవుతాడు. ఆ ఫొటోలు, వీడియోలను ఆసరాగా చేసుకుని యువతిపై సోదరుడు ప్రణయ్‌ లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో ప్రణయ్‌ వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగింది. ఇది గమనించిన చుట్టు పక్కల వాళ్లు.. వెంటనే హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story