ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య.. మృతదేహాం దొరక్కుండా మాయం.. ట్విస్ట్‌ ఇదే.!

A wife brutally murdered her husband with her boyfriend in Khammam district. తెలంగాణ ఖమ్మంలో జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు

By అంజి  Published on  25 Aug 2022 2:01 PM IST
ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య.. మృతదేహాం దొరక్కుండా మాయం.. ట్విస్ట్‌ ఇదే.!

తెలంగాణ ఖమ్మంలో జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతడి మృతదేహాం కూడా మాయం చేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆరెంపులకు చెందిన సాయిచరణ్‌, కొణిజర్లకు చెందిన యువతి నాలుగేళ్ల కిందట లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. కొన్ని రోజుల నుంచి రోటరీనగర్‌లో నివాసం ఉంటున్నారు. సాయి చరణ్‌.. చికెన్‌ వ్యర్థాలు తరలించే డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పని దగ్గర అతడికి కరుణాకర్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

కరుణాకర్‌ తరచూ సాయిచరణ్‌ ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే సాయి భార్యతో కరుణాకర్‌కు ఏర్పడిన పరిచయం.. కాస్త వివాహేతర సంబంధంగా మారింది. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం సాయికి తెలవడంతో భార్యతో గొడవపడ్డాడు. భర్తకు అందరికి చెబితే పరువు పోతుందని భావించిన భార్య.. తన ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్‌ గీశారు. ఈ నెల 1న రాత్రి చికెన్‌ వ్యర్థాలు తీసుకెళ్లేందుకు సిద్ధమైన సాయి, కరుణాకర్‌.. మరో ఇద్దరు డ్రైవర్లతో కలిసి మద్యం సేవించారు. అదే సమయంలో తన భార్యతో ఎందుకు అంత చనువుగా ఉంటున్నావని కరుణాకర్‌ను సాయి నిలదీశాడు.

మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కరుణాకర్‌.. సాయిని బలంగా తోయడంతో ట్రాలీకి గుద్దుకున్నాడు. ఆ తర్వాత పారతో కరుణాకర్‌ బలంగా దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై అనుమానం రాకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని మూటగట్టి చికెన్‌ వ్యర్థాల వాహనంలో వేశాడు. ఏపీలోని కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కుదుపాకు తీసుకెళ్లి ప్రైవేటు చేపల చెరువులో వ్యర్థాలతో మృతదేహాన్ని పడేశాడు. చేపల చెరువులో 3 రోజుల తర్వాత మృతదేహాం తేలింది. వెంటనే కరుణాకర్‌కు యజమాని ఫోన్‌ చేసి చెప్పగా.. మృతదేహాన్ని పక్కనే ఉన్న ఊరి చేపల చెరువులో పడేశాడు. ఈ విషయం తర్వాత తన ప్రియురాలికి చెప్పారు.

నాలుగైదు రోజుల నుంచి సాయి కనబడకపోయేసారికి బంధువులు, యజమాని అతడి భార్యను ప్రశ్నించారు. ఆమె తెలియదని చెప్పటంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాయి భార్య ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ను పరిశీలించగా, ఆమె ఎక్కువ సార్లు కరుణాకర్‌తో మాట్లాడినట్లు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా..అసలు విషయం బయటపడింది. మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగి 25 రోజులు అవుతున్నా.. మృతదేహం లభ్యం కాలేదు.

Next Story