హైదరాబాద్‌లో భయంకర ఘటన చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్‌లో ఓ యువకుడిపై రౌడీ షీటర్ కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. కత్తితో రోషన్ అనే యువకుడిపై రౌడీషీటర్ బాల్‌రెడ్డి దాడి చేశాడు. అయితే బాల్‌రెడ్డి కత్తితో పొడుస్తుండగా మరో వ్యక్తి ఆ యువకుడిని కదలకుండా పట్టుకున్నాడు. ఈ దారుణ ఘటనను అక్కడుకున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది.
అయితే కత్తితో వీరంగం చేస్తూ యువకుడి ప్రాణాలు సైతం తీసేందుకు వెనుకడాని ఆ రౌడీషీటర్‌ను అడ్డుకోవడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. దీంతో ఆ యువకుడు తనపై దాడి చేయొద్దని వేడుకున్నాడు. ఇంతలో రౌడీషీటర్ చేతుల్లో నుంచి ఎట్టకేలకు బాధితుడు తప్పించుకున్నాడు. అయితే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.