బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులు.. హైదరాబాద్‌లో ఘటన

A teacher sexually assaulted a boy in a madrasa.. Incident in Hyderabad. హైదరాబాద్‌ మహా నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ బాలుడిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

By అంజి  Published on  5 Sept 2022 2:05 PM IST
బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులు.. హైదరాబాద్‌లో ఘటన

హైదరాబాద్‌ మహా నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ బాలుడిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలుడిపై అసహజ శృంగారానికి ప్రయత్నించాడు. బాలుడు తనపై జరిగిన అఘయిత్యాన్ని తన తల్లికి చెప్పాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సంతోష్‌నగర్‌లో 14 ఏళ్ల బాలుడిపై 'లైంగిక వేధింపులకు' పాల్పడిన 21 ఏళ్ల మదర్సా ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సంతోష్ నగర్ పోలీసులు నిందితుడిపై బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు అతడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాల ప్రకారం.. పాతబస్తీలోని రియాసత్ నగర్‌లో ఉన్న రెసిడెన్షియల్ మదర్సాలో మైనర్ బాలుడిపై నిందితులు అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు తమ తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. బాలుడిని పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇతర విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో నివసిస్తున్న ఉపాధ్యాయుడు గత రెండు నెలలుగా పలువురిని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.

Next Story