వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దల పండగ సందర్భంగా పొట్టేళ్లను తీసుకొని వెళ్తుండగా నాసనాల్లి సమీపంలో ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ పైనుండి దూసుకెళ్లింది. కాగా ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజు(38), వ్యాపారి రవి(35) అక్కడికక్కడే మృతి చెందగా రవి భార్య సరోజకు తీవ్రగాయాలు కావడండో ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాద ఘటన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.