ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యాన్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఓ కుటుంబం మినీ వ్యాన్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. ఈ క్రమంలోనే చాకిచెర్ల వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. కాగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.