ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు విద్యార్థులు స్పాట్ డెడ్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని మోకిలాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టడంతో అందులో ఉన్న నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్‌గా గుర్తించారు. వీరంతా ICFA ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ కారులో మోకిల నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.