దారుణం.. వృద్ధురాలిపై సెక్యూరిటీ గార్డ్‌ అత్యాచారం

A security guard has been arrested for rapping a mentally ill old citizen. మహారాష్ట్రలోని థానేలో 65 ఏళ్ల మానసిక స్థితి సరిగా లేని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By అంజి  Published on  10 Nov 2021 9:40 AM IST
దారుణం.. వృద్ధురాలిపై సెక్యూరిటీ గార్డ్‌ అత్యాచారం

మహారాష్ట్రలోని థానేలో 65 ఏళ్ల మానసిక స్థితి సరిగా లేని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు నౌపడలోని హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. నిందితుడు కొన్ని నెలల క్రితమే సొసైటీలో పని చేయడం ప్రారంభించాడు. మహిళ ఒంటరిగా నివసిస్తుందని, ఆమె బంధువులు వారానికి రెండుసార్లు ఆమెను సందర్శించేవారని పోలీసులు తెలిపారు. నవంబర్ 3న ఆ మహిళ ఏడుస్తున్నట్లు పొరుగువారు గుర్తించారు. ఆమె తనను తాను గాయపరచుకుందని లేదా ఏదో అనారోగ్యంతో బాధపడుతుందని భావించి వారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ వైద్యులు ఆమె లైంగిక వేధింపులకు గురైందని చెప్పారని నౌపడా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సంజయ్ ధుమాల్ చెప్పారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్ 376 కింద పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. బాధితురాలి ఇరుగు పొరుగు వారిని పోలీసుల విచారించారు. ఈ దారుణానికి పాల్పడింది సెక్యూరిటీ గార్డు అని తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం చేసినట్లు సెక్యూరిటీ గార్డు ఒప్పుకున్నాడని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి స్థానిక కోర్టులో హాజరుపర్చగా.. అతడిని జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు తన బంధువుల వద్ద ఉందని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

Next Story