ఇద్దరిని క‌ర్ర‌తో కొట్టి చంపిన సైకో

బుధవారం ఉదయం యూపీలోని తప్పల్ ప్రాంతంలోని నూర్పూర్ గ్రామంలో మానసిక రుగ్మత కలిగిన వ్యక్తి(పిచ్చి వాడు) కర్రతో గ్రామంలోకి ప్రవేశించి ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి హత్య చేశాడు

By Medi Samrat  Published on  8 May 2024 12:25 PM IST
ఇద్దరిని క‌ర్ర‌తో కొట్టి చంపిన సైకో

బుధవారం ఉదయం యూపీలోని తప్పల్ ప్రాంతంలోని నూర్పూర్ గ్రామంలో మానసిక రుగ్మత కలిగిన వ్యక్తి(పిచ్చి వాడు) కర్రతో గ్రామంలోకి ప్రవేశించి ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి హత్య చేశాడు. ఒకరి మృతదేహాన్ని దహనం చేశారు. సమాచారం మేరకు నిందితుడు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో నూర్పూర్ గ్రామంలోకి ప్రవేశించాడు. పొలంలో పని చేస్తున్న లాలా అనే వ్య‌క్తిని కర్రతో కొట్టడం ప్రారంభించాడు. లాలా తలకు గాయం కావడంతో అత‌డు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆ తర్వాత నిందితుడు తన బట్టలు తీసి లాలాపై విసిరి అతని జేబులో నుండి అగ్గిపెట్టెను తీసి నిప్పంటించాడు. ఇంతలో కొందరు మహిళలు అతన్ని చూసి అర‌వ‌డం మొద‌లుపెట్టారు. వెంట‌నే నిందితుడు బట్టలు లేకుండా వారి వద్దకు పరుగులు తీసి.. అటుగా వెళ్తున్న గ్రామానికి చెందిన జాఫర్‌పై కర్రతో దాడి చేశాడు. పిచ్చోడి దాడిలో అతను కూడా చనిపోయాడు. ఈ ఘ‌ట‌న‌తో గ్రామంలో గందరగోళం నెలకొంది.

గ్రామస్తులు నిందితుడిని చుట్టుముట్టి కొట్టి చంపారు. ఘటనా స్థలానికి ఎస్పీ దేహత్ పలాష్ బన్సల్ చేరుకున్నారు. నిందితుడిని అఫ్జల్ గా గుర్తించారు. ఇప్పటివరకు జరిగిన విచారణపై పోలీసులు మాట్లాడుతూ.. అఫ్జల్ ఇద్దరు వ్యక్తులను హత్య చేసినట్లు తేల‌గా.. అనంతరం గ్రామస్తులు అతడిని హత్య చేసిన‌ట్లు తెలిపారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు. ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story