మహిళల టాయిలెట్‌లో స్మార్‌ఫోన్‌.. వీడియో కెమెరా ఆన్‌ చేసి పెట్టిన ప్యూన్‌

A peon who turned on the smartphone camera in the women's toilet. యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది. మొరాదాబాద్‌లోని కేజీకే పీజీ కాలేజీలో ఓ ప్యూన్ చేసిన దారుణం

By అంజి  Published on  17 Nov 2022 4:20 PM IST
మహిళల టాయిలెట్‌లో స్మార్‌ఫోన్‌.. వీడియో కెమెరా ఆన్‌ చేసి పెట్టిన ప్యూన్‌

యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది. మొరాదాబాద్‌లోని కేజీకే పీజీ కాలేజీలో ఓ ప్యూన్ చేసిన దారుణం బట్టబయలవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. లేడీస్‌ టాయిలెట్‌లో వీడియో ఆన్ చేసి స్మార్ట్‌ఫోన్‌ను ప్యూన్‌ దాచిపెట్టాడు. ప్యూన్‌ రాజేష్ కుమార్‌కు చెందిన ఫోన్‌ను కళాశాల మహిళా అసోసియేట్ ప్రొఫెసర్ టాయిలెట్‌లో గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు చెరవేశారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్యూన్ మొబైల్‌లో అనేక ఇతర వీడియో క్లిప్‌లు కూడా కనుగొనబడ్డాయి. ఆ తర్వాత మజోలా పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రేడ్ IV ఉద్యోగి (ప్యూన్) రాజేష్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

మహిళా అసోసియేట్ ప్రొఫెసర్ తన ఫిర్యాదులో ఇలా వ్రాశారు. 'నవంబర్ 10, మధ్యాహ్నం 3:45 గంటలకు లా డిపార్ట్‌మెంట్‌లోని టాయిలెట్‌కు వెళ్లాను. అక్కడ పని చేసే స్థితిలో స్మార్ట్‌ఫోన్ కెమెరా కనిపించింది. ఆ మొబైల్ ప్యూన్‌ రాజేష్ కుమార్‌కు చెందినది.'' అని పేర్కొన్నారు. లా డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ప్యూన్‌ మొబైల్‌ మహిళా ప్రొఫెసర్‌ దగ్గర ఉంది. ఆ మొబైల్‌లో ఇంకా చాలా వీడియో క్లిప్‌లు వచ్చాయి. ఈ వ్యవహారం హైప్రొఫైల్ కావడంతో పోలీసులు కూడా యాక్టివ్‌గా మారి వెంటనే విచారణ ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Next Story