మచిలీపట్నంలో మైనర్‌ బాలికపై అత్యాచారం

A minor girl was raped in Machilipatnam. మచిలీపట్నంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఇద్దరు

By అంజి  Published on  14 Aug 2022 5:40 PM IST
మచిలీపట్నంలో మైనర్‌ బాలికపై అత్యాచారం

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో కొత్త చట్టాలను తీసుకొస్తోంది. అయినా అమ్మాయిలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలు కనిపిస్తే చాలు.. కామాంధులు బరి తెగిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు.. బాలికను బలవంతంగా తీసుకెళ్లారు. వంతెన కిందకి తీసుకెళ్లి హింసించి బలాత్కారం చేశారు. అత్యాచారం చేస్తూ ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు.

అత్యాచారం చేసినట్టు ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాలికను బెదిరించారు. ఆ తర్వాత బాలికను వదిలి పెట్టారు. దీంతో జరిగిన విషయాన్ని బాలిక తన అన్నకు చెప్పింది. అనంతరం బాలిక తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫొక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఒక నిందితుడు అరెస్ట్ చేశారు. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు కోరుతున్నారు.

Next Story