తనను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి నిరాకరించాడని యువకుడి ముఖంపై ఓ మహిళ యాసిడ్ పోసింది. ఈ ఘటనకు సంబంధించిన మహిళ నిందితురాలిని ఆదిమాలి పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని పూజపురకు చెందిన అరుణ్ కుమార్ (27) యాసిడ్ దాడితో ఒక కన్ను చూపు కోల్పోయి తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.నవంబర్ 16న ఇడుక్కి జిల్లా ఆదిమాలి సమీపంలోని ఇరుంపుపాలెం వద్ద సెయింట్ ఆంటోనీ చర్చి ముందు ఈ ఘటన జరిగింది.
ఆదిమాలి పోలీసులు శనివారం సాయంత్రం ఆదిమాలిలోని వాలారా సమీపంలోని పడిక్కత్‌కు చెందిన నిందితురాలు షీబా (35)ను అరెస్టు చేశారు. ఆదిమాలి సబ్‌ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఖానీ తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురం జిల్లాలో షీబా హోమ్ నర్సుగా పనిచేస్తుండగా అరుణ్‌కుమార్‌తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. షీబా భర్త సంతోష్ హౌస్ పెయింటర్ కాగా ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. యాసిడ్ దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. అయితే వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని పోలీసులు తెలిపారు.
పెళ్లి అయిన విషయం తెలుసుకున్న యువకుడు ఆమెను విడిచిపెట్టాడు. దీంతో అరుణ్‌ను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ తరచూ అరుణ్‌ను వివాహిత కలుస్తుండేది. ఈ క్రమంలోనే అతడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.2 లక్షలు డిమాండ్ చేసింది. అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షీబా తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అరుణ్‌కుమార్ మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియడంతో అతడిని ఆదిమలికి పిలిపించి ముఖంపై యాసిడ్ పోసింది. ఆమె దాడికి రబ్బరు రబ్బరు పాలు గడ్డకట్టడానికి ఉపయోగించే ఫార్మిక్ యాసిడ్‌ను ఉపయోగించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.