ప్రేమ పేరుతో మోసం.. బాలికపై లైంగిక దాడి.!

A man who sexually assaults a girl in the name of love. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ ప్రబుద్ధుడు ప్రేమ పేరుతో బాలికను మోసం చేశాడు. ప్రేమిస్తున్నాంటూ నమ్మించి

By అంజి  Published on  21 Oct 2021 3:19 AM
ప్రేమ పేరుతో మోసం.. బాలికపై లైంగిక దాడి.!

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ ప్రబుద్ధుడు ప్రేమ పేరుతో బాలికను మోసం చేశాడు. ప్రేమిస్తున్నాంటూ నమ్మించి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింగనర్‌లోని వినాయక్‌నగర్‌లో ఓ బాలిక (17) తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఆ బాలికకు అదే ఏరియాలో నివాసం ఉంటున్న భీమ్‌రాజు (23) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో కొంత కాలంగా ఇద్దరు స్నేహం చేసుకున్నారు.

స్నేహం పేరుతో ప్రేమిస్తున్నానంటూ బాలికను నమ్మించాడు. తనతో పాటు బైక్‌పై ఎక్కించుకుని ఓ బంధువు రూమ్‌కు బాలికను తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అంతేకాకుండా జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే అంతుచూస్తానంటూ భీమ్‌రాజ్‌.. ఆ బాలికను బెదిరించాడు. గత కొన్ని రోజులుగా బాలిక మౌనంగా ఉండడాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు.. ఆమెను ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు భీమ్‌రాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story