క‌త్తితో బెదిరింపుల‌కు దిగిన వ్య‌క్తి.. వీడియో వైర‌ల్‌

A man who made threats with a knife. గుంటూరు న‌డిబొడ్డున ఓ వ్య‌క్తి క‌త్తితో హ‌ల్‌చ‌ల్ చేసిన చేశాడు. న‌గ‌రంలోని అరండల్ పేట

By Medi Samrat  Published on  31 May 2021 10:49 AM GMT
క‌త్తితో బెదిరింపుల‌కు దిగిన వ్య‌క్తి.. వీడియో వైర‌ల్‌

గుంటూరు న‌డిబొడ్డున ఓ వ్య‌క్తి క‌త్తితో హ‌ల్‌చ‌ల్ చేసిన చేశాడు. న‌గ‌రంలోని అరండల్ పేట 4వ లైన్ లో ఓ వ్య‌క్తి కత్తితో మ‌రోవ్యక్తి పైన దాడి చేసేందుకు య‌త్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కాబోయే భర్తతో కలిసి బయటకి వచ్చింది అమ్మాయి. ఇదే అదునుగా చూసుకొని అరండల్ పేట 4వ లైన్ పార్క్ దగ్గర ఆ అమ్మాయి, అబ్బాయిపైన దాడికి య‌త్నించాడు ఓ వ్య‌క్తి.

అయితే.. బెదిరింపుల‌కు పాల్ప‌డిన వ్య‌క్తి గ‌త కొంత కాలంగా.. అమ్మాయి వెంట ప‌డుతూ.. వేధింపులకు గురిచేస్తూ.. నిన్ను ప్రేమిస్తున్నాను.. నన్ను తప్ప ఎవరితో ఉండకూడదు వేధింపులకు పాల్ప‌డుతున్నాడ‌ని తెలుస్తోంది. అయితే.. చుట్టుప్రక్కల వారు గుమిగూడటంతో దాడికి య‌త్నించిన వ్యక్తి అక్క‌డినుండి పరార్ అయ్యాడు. వారిరువురిది శారదా కాలనీగా చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై అమ్మాయి అరండల్ పేటలో కేసు నమోదు చేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
Share it