అమానుషం.. రెండేళ్ల చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన మారు తండ్రి.. ఆ తర్వాత..!

A man who killed a two-year-old girl in Medak. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం పాల్వంచ గ్రామంలో దారుణ ఘటన జరిగింది. అభంశుభం తెలియిన ఓ రెండేళ్ల చిన్నారిని మారు తండ్రి దారుణంగా

By అంజి  Published on  1 Dec 2021 4:25 AM GMT
అమానుషం.. రెండేళ్ల చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన మారు తండ్రి.. ఆ తర్వాత..!

మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం పాల్వంచ గ్రామంలో దారుణ ఘటన జరిగింది. అభంశుభం తెలియిన ఓ రెండేళ్ల చిన్నారిని మారు తండ్రి దారుణంగా హతమార్చాడు. రెండేళ్ల చిన్నారి పట్ల కర్కశత్వంగా వ్యవహరించిన మారు తండ్రి.. గొంతు నులిమి చిన్నారి ప్రాణాలు తీశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ గ్రామానికి చెందిన బుర్ల రమణయ్యకు అదే గ్రామానికి చెందిన సావిత్రి వివాహం జరిగింది. రమణయ్య వ్యవసాయ కూలీ పని చేసేవాడు. ఈ క్రమంలోనే సావిత్రి 2016లో అందోలు మండలం రోడ్లపాడుకు చెందిన సురేశ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వారికి వర్షిణి పుట్టింది. 2020లో రెండో భర్త సురేశ్‌ను వదిలేసిన సావిత్రి.. తిరిగి తన బిడ్డతో కలిసి మొదటి భర్త రమణయ్య దగ్గరకు వచ్చింది. అప్పటి నుండి రమణయ్యతోను కలిసి ఉంటోంది.

భార్యను, భార్య కూతురును రమణయ్య మొదట్లో బాగానే చూసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత సావిత్రి గర్భం దాల్చింది. ఆమెను, వర్షిణిని మంగళవారం నాడు రమణయ్య టేక్మాల్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. భార్యకు వైద్యులు చికిత్స చేసిన అనంతరం.. తనకు తెలిసిన వారి బైక్‌పై ఇంటికి పంపించాడు. తాను చిన్నారి వర్షిణితో కలిసి వస్తానని భార్య సావిత్రికి చెప్పి పంపించాడు. చిన్నారిని తీసుకుని వెళ్తుండగా మార్గం మధ్యలో పాప గొంతు నులిమి రమణయ్య హత్య చేశాడు. ఆ తర్వాత మృతి చెందిన పాపను తీసుకుని అలాగే బైక్‌పై ఇంటికి వెళ్లాడు. ఏమైందని భార్య రమణయ్యను నిలదీసింది. చివరికి తానే వర్షిణిని హత్య చేశానని రమణయ్య చెప్పాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. రమణయ్య ఇంటికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.

Next Story
Share it