మాట్లాడ‌టం లేదని.. ఇంటికెళ్లి యువతిని బెదిరించాడు.. ఆ తర్వాత

A man threatens to throw acid on woman after she stops talking to him. యాసిడ్‌తో దాడి చేస్తానని మహిళను బెదిరించినందుకు ఓ వ్యక్తిపై వేజల్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ముస్తాక్

By అంజి  Published on  20 Dec 2021 1:58 PM GMT
మాట్లాడ‌టం లేదని.. ఇంటికెళ్లి యువతిని బెదిరించాడు.. ఆ తర్వాత

యాసిడ్‌తో దాడి చేస్తానని మహిళను బెదిరించినందుకు ఓ వ్యక్తిపై వేజల్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ముస్తాక్ మన్సూరిపై 25 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. మాట్లాడటానికి నిరాకరించడంతో యాసిడ్ దాడికి పాల్పడతానని ఆ వ్యక్తి తనను బెదిరించాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అహ్మదాబాద్‌లోని జుహాపురా నివాసి అయిన బాధితురాలు.. వెజల్‌పూర్‌లో నివసించే ముస్తాక్‌ మన్సూరి సుమారు ఏడేళ్లుగా స్నేహితులుగా ఉన్నామని పోలీసులకు తెలిపింది. కానీ ఆమె గత కొద్ది రోజులుగా అతనితో మాట్లాడటం మానేసింది. మన్సూరి శనివారం మధ్యాహ్నం యువతి ఇంటికి వచ్చి గొడవ పెట్టాడు.

మాట్లాడటం మానేసి దూరం పెడుతుండటంతో ముస్తాక్‌ ఆమెను ప్రశ్నించాడని తెలుస్తోంది. ఇక అతడితో స్నేహం చేయడం ఇష్టం లేదని ఆమె చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముస్తాక్‌ బాధిత యువతిపై దుర్భాషలాడడం ప్రారంభించాడు. ఆమె పొరుగువారు గుమిగూడిన తర్వాత, అతను ఆమెపై యాసిడ్ దాడి చేస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆ మహిళ తన తండ్రికి తెలియజేయడంతో అతను పోలీసులను ఆశ్రయించాల్సిందిగా కోరాడు. వేజల్‌పూర్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ బెదిరింపు, ఇతర నేరాలకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story
Share it