Tirupati: 14 ఏళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారం.. మభ్యపెట్టి తరగతి గదిలోనే..

ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ ఘటన జరిగింది. తిరుపతిలోని ఓ స్కూల్‌లో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

By అంజి
Published on : 24 Aug 2024 6:30 AM

Tirupati, Crime, APnews

Tirupati: 14 ఏళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారం.. మభ్యపెట్టి తరగతి గదిలోనే..

ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ ఘటన జరిగింది. తిరుపతిలోని ఓ స్కూల్‌లో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని ఓ ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో ఉంటూ 14 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది. హాస్టల్‌కు సరుకులు సరఫరా చేసే నిందితుడు రుషి ఆమెతో పరిచయం ఏర్పరుచుకుని అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

బుధవారం మధ్యాహ్నం లంచ్‌ బ్రేక్‌ సమయంలో సత్యవేడు మండలం కన్నవరానికి చెందిన 40 ఏళ్ల రుషి స్కూల్‌లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారం చేశాడు. శుక్రవారం నాడు బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఘటన బుధవారం నాడు జరిగినా గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఘటనపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ''నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో తరగతి గదిలోనే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన డ్రైవర్ రిషి. ఈ నెల 21న ఘటన జరిగితే.. బయటికి పొక్కకుండా జాగ్రత్తపడిన కూటమి ప్రభుత్వం. ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న బాలిక. ఏపీలో ఆడబిడ్డలపై ఆగని అత్యాచారాలపర్వం.. చోద్యం చూస్తున్న సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత'' అని ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

Next Story