దారుణం.. బండ‌రాయితో త‌ల‌పై కొట్టి భార్యను చంపిన భ‌ర్త‌.. కారణం అదే.!

A man murdered his wife due to family dispute. పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భ‌ర్త‌తో ఉండ‌లేన‌ని తెగేసి చెప్పిన భార్య‌ను బండ‌రాయితో త‌ల‌పై కొట్టిచంపాడో భ‌ర్త‌.

By అంజి  Published on  4 Dec 2021 4:11 PM IST
దారుణం.. బండ‌రాయితో త‌ల‌పై కొట్టి భార్యను చంపిన భ‌ర్త‌.. కారణం అదే.!

పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భ‌ర్త‌తో ఉండ‌లేన‌ని తెగేసి చెప్పిన భార్య‌ను బండ‌రాయితో త‌ల‌పై కొట్టిచంపాడో భ‌ర్త‌. ఈ దారుణ ఘటన మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో జరిగింది. భార్య భర్తల మధ్య చిన్నగా మొదలైన గొడవ.. చిలికి చిలికి పెద్దదిగా మారింది. వారి గొడవలు పెద్ద మనుషుల దాకా వెళ్లింది. పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలోనే భర్తతో తాను ఉండలేనని భార్య తెగేసి చెప్పింది. ఆ వెంటనే పంచాయతీ జరుగుతున్న స్థలం నుంచి బయల్దేరింది. దీంతో ఒక్కసారిగా కోపం తెచ్చుకున్న భర్తను ఆమె వెంబడించి హత్య చేశాడు. బండరాయితో తలమీద కొట్టి చంపేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉప్పట్ల గ్రామంలో కాసిపేట రేణుక (35), తన భర్తతో ఉంటోంది. అయితే ఇటీవల వారి మధ్య కలహాలు రేగాయి. భార్య భర్తల మధ్య గొడవలు పెద్దగా మారడంతో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు. పంచాయతీ జరుగుతుండగానే భార్య రేణుక.. తన భర్తతో కాపురం చేసేది లేదని చెప్పింది. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోసాగింది. ఈ క్రమంలోనే ఆగ్రహాంతో భర్త ఓ బండరాయిని తీసుకుని ఆమె తలపై కొట్టాడు. దీంతో రేణుక అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికంగా దారుణ హత్య జరగడంతో తీవ్ర కలకలం రేపింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story