ఇంటిపైకి తీసుకెళ్లి.. 5 ఏళ్ల బాలికపై అత్యాచారం.. పరిస్థితి విషమం

A five-year-old girl was allegedly raped in Odisha. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి

By అంజి  Published on  25 Jan 2022 3:51 PM IST
ఇంటిపైకి తీసుకెళ్లి.. 5 ఏళ్ల బాలికపై అత్యాచారం.. పరిస్థితి విషమం

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా ఓ మానవ మృగం చేసిన దారుణానికి.. ఆ బాలిక ప్రాణం కోసం ఆస్పత్రిలో పోరాడుతోంది. ఒడిశాలోని పూరీ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికపై నిందితుడు అఘాయిత్యానికి ఓడిగట్టాడు. ఇంటి పైకప్పుపైకి తీసుకెళ్లి బాలికపై నిందితుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ప్రస్తుతం బాలిక కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోందని వారు తెలిపారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు బాలిక కుటుంబానికి పరిచయస్తుడు, బాలికను పైకప్పుపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని వారు తెలిపారు. ఆమె కేకలు విన్న బాలిక తల్లి పైకప్పుపైకి పరుగెత్తి చూడగా నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. బాలిక పరిస్థితి విషమించడంతో పూరీ జిల్లా ఆసుపత్రిలో చేర్చి, కటక్‌లోని వైద్య సదుపాయానికి తరలించారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ కెవి సింగ్ తెలిపారు. ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందినవాడని పోలీసులు తెలిపారు.

Next Story