హైదరాబాద్‌లో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తోన్న మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆస్పత్రికి వెళ్లింది. మరో నాలుగు గంటల్లో డిశ్చార్జ్ అయ్యే సమయానికి ఈ దారుణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సుదీప్తి (27) నెల్లూరు వాసి. బండ్లగూడ జాగీర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. నవంబర్ 6వ తేదీన అనారోగ్యం కారణంగా సుదీప్తి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడే మూడు రోజులుగా చికిత్స తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే ఆమె మంగళవారం ఉదయం నాటికి పూర్తిగా కోలుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారు. ఉదయం 9 గంటల సమయంలో ఆమె చికిత్స పొందుతున్న గదికి వెళ్లడానికి నర్సు తలుపు తెరవడానికి ప్రయత్నించగా దానికి.. ఆమె లోపలి నుండి గడియపెట్టుకుంది. సిబ్బంది అనుమానంతో తలుపుల బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూశారు. ఫ్యానుకు ఉరివేసుకుని సుదీప్తి విగత జీవిలా కనపడింది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. మృతురాలు సుదీప్తి తల్లి బెంగళూరులో ఆమె సోదరుడి దగ్గర ఉంటోందని తెలిసింది.