Hyderabad: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డుప్రమాదం.. కారు గుద్దితే తల తెగింది

హైదరాబాద్‌ నగరంలోని శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీ కొట్టింది.

By అంజి  Published on  6 Aug 2024 12:35 PM IST
road accident, ORR , Hyderabad, Shamshabad

Hyderabad: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డుప్రమాదం.. కారు గుద్దితే తల తెగింది

హైదరాబాద్‌ నగరంలోని శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీ కొట్టింది. రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఓ కారు మితిమీరిన వేగంతో వచ్చి అతన్ని ఢీ కొట్టింది. దీంతో అతడు ఎగిరి వచ్చి తల కాయ కారు ముందు భాగంలోని అద్దంలో ఇరుక్కుపోయింది. అయితే కారు అద్దంలో ఇరుక్కుపోయిన సదరు వ్యక్తిని కొంత దూరం వరకు ఈర్చుకుపోవడంతో అతని మెడకాయ తెగిపోయి కారు వెనక సీట్లో పడిపోయింది. అతి గమనించిన వెంటనే కారు డ్రైవర్ కారును ఆపేసి వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాడు.

ఆ వ్యక్తి తల తెగి కారు వెనకాల సీట్‌లో పడగా.. మొండెం కారు అద్దంలో ఇరుక్కుపోయింది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు శంషాబాద్ మున్సిపాలిటీ ఉట్ పల్లి గ్రామానికి చెందిన తోట్ల అంజయ్యగా పోలీసులు గుర్తించారు. మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఢీకొట్టడంతో కారు ముందుభాగంలోని అద్దంలో అంజయ్య బాడీ ఇరుక్కుపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కారును సీజ్ చేసి.. డ్రైవర్ను అరెస్టు చేశారు

Next Story