వైజాగ్ కాలనీ వెళ్లొస్తున్న కారును ఢీకొట్టిన బస్సు..స్పాట్‌లో ముగ్గురు స్నేహితులు మృతి

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By -  Knakam Karthik
Published on : 11 Jun 2025 10:54 AM IST

Crime News, Telangana, Rangareddy District, Three Died

వైజాగ్ కాలనీ వెళ్లొస్తున్న కారును ఢీకొట్టిన బస్సు..స్పాట్‌లో ముగ్గురు స్నేహితులు మృతి

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై కారును బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన వాస సాయితేజ (22) మూసాపేట్‌కు చెందిన వాస పవన్ కుమార్(25) రాఘవేందర్ (25) మరో నలుగురు స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీకి వెళ్లారు. తిరిగు ప్రయాణంలో హైదరాబా‌ద్‌కు వస్తుండగా.. మాల్ సమీపంలోని మైసమ్మ దేవాలయం దాటి ఎస్సార్ పెట్రోల్ బంకు వద్దకు చేరుకోగానే నాగార్జునసాగర్ వైపు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చి కాను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. వాస శివకుమార్, వాస సాయికుమార్, ఎం.సందీప్, శివ కుమార్‌లకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వారిని చికిత్స కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story