ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు స్మార్ట్‌ఫోన్‌ కొనిస్తే.. ఆ వీడియోలు చూస్తూ.. 4 ఏళ్ల బాలికపై..

A 14 year old boy did a major crime. ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు 14 ఏళ్ల బాలుడికి స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చారు తల్లిదండ్రులు. అయితే ఆ బాలుడు మాత్రం ఫోన్‌లో క్లాసులు

By అంజి  Published on  20 Oct 2021 10:28 AM IST
ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు స్మార్ట్‌ఫోన్‌ కొనిస్తే.. ఆ వీడియోలు చూస్తూ.. 4 ఏళ్ల బాలికపై..

ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు 14 ఏళ్ల బాలుడికి స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చారు తల్లిదండ్రులు. అయితే ఆ బాలుడు మాత్రం ఫోన్‌లో క్లాసులు వినకుండా అశ్లీల వీడియోలు చూసేందుకు బాగా అలవాటు పడ్డాడు. ఆ కామోద్రేకంలో ఓ నాలుగేళ్ల పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. న్యూకంప్టి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉండే ఓ బాలుడు ఫోన్‌లో అశ్లీల వీడియోలకు బానిసయ్యాడు. ఇటీవల ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు బయటికి వెళ్లారు. ఆరేళ్ల వయసు గల చెల్లిని మాత్రం ఇంట్లోనే ఉంచి వెళ్లిపోయారు. దీంతో ఆ బాలుడు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి అశ్లీల వీడియోలు చూడడం మొదలు పెట్టాడు. ఆ కామంతోనే పక్కింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారిని ఆడుకోవడానికి పిలవాలని తన చెల్లికి చెప్పాడు. తన అన్న ఇంత దారుణానికి ఒడిగడతాడని పసిగట్టలేకపోయిన ఆ చెల్లి నాలుగేళ్ల పాపను ఆడుకోవడానికి తీసుకువచ్చింది.

ఆ తర్వాత తన చెల్లి, చిన్నారితో కలిసి కాసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత బాలుడి చెల్లెలు టీవీ చూస్తూ ఉండిపోయింది. ఇదే సమయంగా భావించిన ఆ బాలుడు టీవీ చూస్తున్న ఆ చిన్నారిని చాక్లెట్‌ ఆశ చూపి బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన చిన్నారి.. ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని తీసుకుని పోలీస్‌స్టేషన్‌కి వెళ్లారు. ఆ టీనేజర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్‌ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌ క్లాసుల కోసం తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలి. కానీ ఒకంట వారిని ఏం చేస్తున్నారో గమనించాలి. అశ్లీల వీడియోల వ్యామోహంలో కొందరు చిన్నారుల జీవితాలను టీనేజర్లు చిదిమేస్తున్నారు. ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా మహిళలపై ఆకృత్యాలు ఆగడం లేదు. చిన్నారులన్న కనికరం లేకుండా అమానుషాలకు పాల్పడుతున్నారు. ఇక ముఖ్యంగా టీనేజర్లు ఇంతటి దారుణాలకు పాల్పడుతున్నారంటే ఆందోళన కలిగించే విషయం.

Next Story