స్కూలు ఎగ్గొట్టేందుకు.. మైనర్ బాలుడిని చంపేసిన పదో తరగతి విద్యార్థి
A 10th class student killed a minor boy to escape from studies. ఉత్తరప్రదేశ్ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ ఎగ్గొట్టేందుకు ..16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి 8వ తరగతి చదువుతున్న
By అంజి Published on 24 Aug 2022 10:13 AM ISTఉత్తరప్రదేశ్ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ ఎగ్గొట్టేందుకు ..16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి 8వ తరగతి చదువుతున్న తన స్నేహితుడు నీరజ్‌కుమార్ (13) అతడిని హత్య చేశాడు. ఘజియాబాద్‌లోని ముస్సోరీలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం సాయంత్రం స్నేహితుడిని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం స్వయంగా గార్డెన్ ఎన్ క్లేవ్ పోలీస్ పోస్టు వద్దకు చేరుకుని తనకు చదువు ఇష్టం లేదని జైలుకు పంపాలని పోలీసులను కోరాడు.మొదట అతడు చెప్పింది పోలీసులు నమ్మలేదు.
కానీ.. అతడు చెప్పిన స్థలంలో నీరజ్ మృతదేహం కనిపించడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తనతో మాట్లాడుతున్నప్పుడు.. నీరజ్‌ను గాజు సీసాతో గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించినట్లు బాలుడు విచారణలో చెప్పాడు. మృతి చెందినట్లు నిర్ధారించిన తర్వాత అక్కడి నుంచి బాలుడు వెళ్లిపోయాడు. ఈ కేసు ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంకగర్హి గ్రామానికి చెందినది. నీరజ్, నిందితుల ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. ఇద్దరూ కలిసి ఆడుకునేవారు.నిందితుడిని పోలీసులు ఇంటరాగేషన్ చేశారు.
అతను పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేదని గ్రామీణ ప్రాంతాల ఎస్పీ డాక్టర్ ఇరాజ్ రజా చెప్పారు. కుటుంబీకులు ఒత్తిడి తెచ్చి పంపేవారు కానీ అతడికి చదువుకోవాలని అనిపించలేదని, అతను చదువులో బలహీనుడు, మార్కులు చాలా తక్కువ అని చెప్పారు. నెలలో పదికి పైగా సెలవులు తీసుకునేవాడు. జైల్లో చదువులు సాగవని చాలా చోట్ల విన్నానని చెప్పాడు. దీంతో జైలుకు వెళితే చదువు మానేయవచ్చని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జైలుకు వెళ్లే మార్గాల గురించి నిందితుడు ఆలోచించడం మొదలుపెట్టాడు.
హత్యా నేరానికి పాల్పడితే చాలా కాలం జైలులో ఉండొచ్చని భావించి ఈ నేరానికి పాల్పడ్డాడు. మంగళవారం చిల్డ్రన్స్ కరెక్షనల్ హోంకు నిందితుడిని పంపించారు. చాలా రోజుల క్రితమే హత్యకు పథకం సిద్ధం చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు చెప్పాడు. రోజూ సాయంత్రం ఆడుకుందామని చెప్పి నీరజ్‌ని తీసుకెళ్లేవాడు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్ కింద హత్య చేయాలనుకున్నాడు. గత మూడు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నా అవకాశం రాలేదు. మరోరోజు ఆడుకోవడానికి నీరజ్ కుమార్‌ను తీసుకెళ్లిన నిందిత బాలుడు.. అనంతరం నీరజ్ గొంతుకోసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.