జగిత్యాలలో 93 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య

93-year-old man to commits suicide in Jagtial. వృద్ధాప్యంలో వస్తున్న సమస్యలను తట్టుకోలేక ధర్మపురి మండలం రాయపట్నం వంతెన వద్ద

By Medi Samrat  Published on  11 April 2022 8:45 AM IST
జగిత్యాలలో 93 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య

వృద్ధాప్యంలో వస్తున్న సమస్యలను తట్టుకోలేక ధర్మపురి మండలం రాయపట్నం వంతెన వద్ద 93 ఏళ్ల వృద్ధుడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కాచిరెడ్డిపల్లికి చెందిన దోర్నాల రాజిరెడ్డి గత కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఏప్రిల్ 8న ఇంటి నుంచి వెళ్లిన రాజిరెడ్డి రాయపట్నం బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి మృతదేహం ఆదివారం నీటిలో తేలింది.

నీళ్లలో రాజిరెడ్డి మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ధర్మపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నీటిలోంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు తిరుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.









Next Story