ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మహిళలు మృతి

కేరళలోని వాయనాడ్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  25 Aug 2023 2:11 PM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మహిళలు మృతి

కేరళలోని వాయనాడ్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం తొమ్మిది మంది మరణించినట్లు సమాచారం. వార్తా సంస్థ PTI ప్రకారం.. జీపు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. మనంతవాడిలో జీపు 25 మీటర్ల లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది మహిళలు మృతి చెందగా.. డ్రైవర్‌తో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చ‌నిపోయిన వారంతా మ‌హిళ‌లే కావ‌డం విశేషం. మృతులను తాళ్లపూజ సమీపంలోని మక్కిమలకు చెందిన రాణి, శాంతి, చిన్నమ్మ, లీల, రబియా, షాజ, శోభన, మేరీ, వసంతలుగా గుర్తించారు.

సాయంత్రం 4:30 గంటలకు తాళప్పుజా వద్ద కన్నోత్మల సమీపంలో వాహనం ఒక తోట నుండి కార్మికులను తీసుకువెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో జీపు పూర్తిగా ధ్వంసమైంది. కిందపడిన తాకిడికి వాహనం రెండు ముక్క‌లైంది. ఈ దుర్ఘటనలో మృతులంతా వాయనాడ్ జిల్లాకు చెందిన వారని ప్రాథమిక సమాచారం. గాయపడిన వారు వాయనాడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కోజికోడ్‌లో ఉన్న అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్‌ను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రమాద స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. వాయనాడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో గాయపడిన వారిని అటవీశాఖ మంత్రి పరామర్శించారు. క్షతగాత్రులకు చికిత్స సహా అన్ని చర్యలను సమన్వయం చేయాలని.. ఇతర అవసరమైన పనులను చేపట్టాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని సీఎంఓ ప్రకటన తెలిపింది.

Next Story