కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు.. 9 మంది మృతి

9 killed in boiler blast at chemical factory in UP's Hapur. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో శనివారం సాయంత్రం ఒక కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్

By Medi Samrat  Published on  4 Jun 2022 6:59 PM IST
కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు.. 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో శనివారం సాయంత్రం ఒక కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో తొమ్మిది మంది మరణించారు. ఈ ప్ర‌మాదంలో 20 మంది గాయపడ్డారు. మరికొందరు కార్మికులు కూడా ఫ్యాక్టరీలో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. మృతులకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలుపుతూ.. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందించాలని అధికారులను కోరారు.

"జిల్లా పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి రెస్క్యూ, రిలీఫ్ చర్యలను పర్యవేక్షించాలని.. బాధితులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని" అని సిఎం కార్యాలయం ట్వీట్ చేసింది.

ఈ పేలుడులో మొత్తం 19 మంది కూలీలు గాయపడ్డారని, తొమ్మిది మంది మరణించారని హాపూర్ డీఎం మేధా రూపమ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీకి అనుమతి ఇచ్చామని, అయితే అసలు ఏం జరుగుతోందన్న దానిపై విచారణ జరగాల్సి ఉందని ఆమె అన్నారు.

హాపూర్‌లోని ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ యూనిట్‌లో జరిగిన పేలుడులో మొత్తం 15 మంది కూలీలు గాయపడగా, ఎనిమిది మంది కూలీలు మరణించారని హాపూర్ ఐజీ ప్రవీణ్ కుమార్ ఇంతకు ముందు తెలియజేశారు. "గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాము. బాధ్యులపై చర్యలు తీసుకుంటాము" అని ప్రవీణ్ కుమార్ తెలిపారు.















Next Story