వృద్ధ దంపతుల దారుణ హత్య
80-Year-Old Man, His Wife Found Dead With Throats Slit In UP Village. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ గ్రామంలో 80 ఏళ్ల వృద్ధుడు, అతని భార్యను గొంతు కోసి హత్య చేశారు.
By M.S.R Published on 13 Jan 2023 7:15 PM IST
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ గ్రామంలో 80 ఏళ్ల వృద్ధుడు, అతని భార్యను గొంతు కోసి హత్య చేశారు. ఈ హత్యలు చేసి 10 లక్షల విలువైన వస్తువులను కూడా అపహరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. దొంగిలించబడిన వస్తువుల విలువ ఇంకా నిర్ధారించలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. చనిపోయిన వారిని కిరాణా షాపు యజమాని చమ్మిలాల్, అతని 75 ఏళ్ల భార్య ఎమ్మార్టీ దేవిగా గుర్తించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పశ్చిమ) విజయ్ ధుల్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణకు ఆదేశించారు. ఫోరెన్సిక్ నిపుణులు, స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌ను సాక్ష్యాలను సేకరించడానికి పిలిచారు.
జాయింట్ సీపీ (లా అండ్ ఆర్డర్) ఆనంద్ ప్రకాష్ తివారీ మాట్లాడుతూ.. శుక్రవారం తెల్లవారుజామున దాదాపు అరడజను మంది దొంగలు ముసుగులు ధరించి రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చి కుటుంబంపై దాడి చేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారని అన్నారు. వృద్ధ దంపతుల కోడలు సప్న, ఆమె ఇద్దరు పిల్లలను బెదిరించారని పోలీసులు చెప్పుకొచ్చారు. దొంగల్లో ఒకరు అల్మరాలను పగులగొట్టి, అక్కడ ఉన్న నగలు, 10 లక్షల నగదును తీసుకెళ్లారని మరో అధికారి తెలిపారు. సప్న దొంగల చెర నుండి బయటపడి కేకలు వేయడంతో కొంతమంది గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు. ఇంతలో నిందితులు పారిపోయారు. స్థానికులు లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఇద్దరినీ కనుగొన్నారు. స్వప్న భర్త రాజ్ కుమార్ పొలానికి వెళ్లిన సమయంలో దుండగులు ఇంటిపై దాడి చేశారు. "కేసును ఛేదించడంలో సహాయపడే కొన్ని లీడ్‌లను మేము కనుగొన్నాము" అని జాయింట్ CP తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం పరీక్ష కోసం పంపినట్లు తెలిపారు.