యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 8 మంది మృతి

8 killed in massive collision between truck car.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆగ్రా-కాన్పూరు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2021 3:47 AM GMT
8 killed in massive collision between truck car

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆగ్రా-కాన్పూరు హైవేపై ట్ర‌క్కు-కారు ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఎత్మాఉద్ధౌల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డి చేరుకున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌మాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో క్రేన్ సాయంతో కారులో ఇరుక్కుపోయిన వారిని బ‌య‌ట‌కు తీశారు. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ట్ర‌క్కు నాగాలాండ్‌కు చెందింద‌ని, కారు జార్ఖండ్ రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌తో ఉంద‌ని పోలీసులు తెలిపారు. మృత‌దేహాల‌కు సంబంధించిన వివ‌రాలు ఇంకా తెలియ‌లేదు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
Next Story
Share it