ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
8 dead, 9 injured in bus-cruiser collision in Haryana’s Jind. హర్యానా రాష్ట్రం బీబీపూర్ గ్రామ సమీపంలోని జింద్-భివానీ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు మార్గంలో ఎదురెదురుగా
By Medi Samrat Published on 8 July 2023 9:52 AM GMTహర్యానా రాష్ట్రం బీబీపూర్ గ్రామ సమీపంలోని జింద్-భివానీ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు మార్గంలో ఎదురెదురుగా వెళ్తున్న బస్సు, క్రూజర్ ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఎస్పీ రోహతాస్ ధుల్.. పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జింద్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. జింద్ నుంచి భివానీకి వెళ్తున్న బస్సు.. ముంధాల్ నుంచి జింద్‌కు వస్తున్న క్రూజర్.. బీబీపూర్ సమీపంలో ఢీకొన్నాయి. విషయం తెలిసిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు చాలా శ్రమించారు. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ రోహతాస్, ఇతర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ప్రమాద తీవ్రతను గమనించి సివిల్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో అదనపు వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని నియమించి క్షతగాత్రులకు చికిత్స అందించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా వైద్యులను విధుల్లోకి తీసుకున్నామని సివిల్ ఆసుపత్రి డిప్యూటీ ఎంఎస్ డాక్టర్ రాజేష్ భోలా తెలిపారు. సీరియస్‌గా ఉన్న రోగులకు చికిత్స అందిస్తున్నామని.. మరణించిన వారి మృతదేహాలను సివిల్ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు తెలిపారు.
आज जींद में भिवानी रोड पर हुए दर्दनाक सड़क हादसे में लोगों की आकस्मिक मृत्यु का समाचार अत्यंत दुखदाई है।
— Manohar Lal (@mlkhattar) July 8, 2023
ईश्वर दिवंगत आत्माओं को शांति दें व शोकाकुल परिजनों को दुःख सहन करने की शक्ति प्रदान करें। घायलों के शीघ्रातिशीघ्र स्वस्थ होने की कामना करता हूँ।
मैं प्रदेशवासियों से आग्रह…
ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం తెలిపారు. జింద్‌లోని భివానీ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రజలు మరణించడం చాలా బాధాకరం. దేవుడు మృతుల ఆత్మలకు శాంతిని ప్రసాదించాలని, మృతుల కుటుంబాలకు ఆ నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలను కోరారు.